Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుకు కంగనాతో డేటింగ్ చేయకుండా ఉండాల్సింది: శేఖర్ సుమన్

కంగనా రనౌత్ తో తన కుమారుడు అధ్యాయన్ సుమన్ డేటింగ్ చేయకుండా ఉండాల్సిందని ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటుడు శేఖర్ సుమన్ అభిప్రాయపడ్డారు. కంగనా, హృతిక్ వివాదం నేపథ్యంలో అధ్యాయన్ మాట్లాడుతూ, కంగనా క్షద్ర పూజలు చేసేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శేఖర్ సుమన్ మాట్లాడుతూ, అధ్యాయన్ అలా మాట్లాడలేదని అన్నారు. కంగనా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామని చెప్పిన శేఖర్ సుమన్, ఆ విషయాలు ఏంటన్న విషయం మాత్రం వెల్లడించకపోవడం విశేషం. అయితే అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉండమని అధ్యాయన్ ను హెచ్చరించామని ఆయన తెలిపారు. తమ కుమారుడి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని డేటింగ్ ఆపేయాలని సూచించామని ఆయన అన్నారు. కంగనా, హృతిక్ వివాదం వారిద్దరి వ్యక్తిగత అంశమని చెప్పిన ఆయన, దానిపై మాట్లాడే హక్కు వారిద్దరికే ఉందని అన్నారు. ఏం జరిగిందన్నది కూడా వారిద్దరికే తెలుసని ఆయన చెప్పారు. ఇందులో మాట్లాడేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News